Jagan Govt in AP may continue for Three and half years only. With Modi one nation..one election plan in central and AP govt tenure may close by 2022-2023. AP CM also preparing for this.
#apgovt
#pmmodi
#tdp
#bjp
#ycp
#Jagan
#amithshah
ఏపీలో వైసీపీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొమ్మదేళ్ల పోరాటంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయింది. తిరిగి 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని జగన్ ఇప్పటికే పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. అయితే, కేంద్రం ఆలోచన మరోలా ఉంది. రెండో సారి మోదీ ప్రధాని అయిన తరువాత ఆలోచనలు మారిపోతున్నాయి. ఫలితంగా ఏపీలో అయిదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు. మూడున్నారేళ్లకే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం సై అంటున్నారు. అంటే 2024లో కాకుండా ముందుగానే ఎన్నికలు రానున్నాయి.